మంగళవారం 12 ఆగస్టు 2008

రాక్ సంగీతం - సంగీతానికి మరో వైపు

మానవుని మనస్సు అనేక భావనల సమాహారం. ఒక వైపు ప్రేమ, సంతోషం , ఆనందం. మరో వైపు కోపం , తీవ్ర ఆవేశం, గాయం, నొప్పి, మనం అనుకున్నది జరగక పోవడం, అవమానం, అసమానత, పోటితత్త్వం లేమి, లాంటి చీకటి భావనలు. ఈ చీకటి భావనలు మనమేవ్వరు బయటకి చెప్పలేం.

ఈ హెవీ మెటల్ లేక రాక్ సంగీతం అలాంటి భావనలనే స్పృశిస్తుంది. మన నిస్స్సహయతల నుంచి మనల్ని బయటకు పడేసి మనకు ప్రేరణ ఇచ్చే ఎనర్జీ డ్రింక్ యొక్క ప్రతి గుటుకు ఈ రాక్ సంగీతం.

ఈ రాక్ సంగీతం పాటల్లో పెద్ద పెద్ద శబ్దాలు, ఊహా లోకం, హింసా ఇవన్ని కలపి ప్రేరణ ఇచ్చేటివిగా వుంటాయి. ఈ రాక్ సంగీతం మీరు నిస్సహాయులుగా వున్నప్పుడు మిమ్మల్ని నిశబ్ధం నుంచి చైతన్యం లోకి నడిపిస్తుంది. ఈ రాక్ సంగీతం మిమ్మల్ని శక్తీ వంతం గాను, మీ ఎమోషన్స్ అన్ని మీ నితయంత్రణలో వుండేటట్లు , మీ కల సాకారానికి మిమ్మల్ని తాయారు చేస్తుంది.

ఈ రాక్ సంగీతాన్ని విపరీతంగంగా అభిమానించే వారిని 'మెటల్ హెడ్' అంటారు. ఈ రాక్ సంగీతం పాడే వారిని 'రాక్ బ్యాండ్ ' అంటారు. రాక్ బ్యాండు లో సహజంగా ఒక గాయకుడు, లీడ్ గిటారిస్టు , బాస్ గిటారిస్టు , ద్రమ్మర్ వుంటారు.
ఇంకొన్ని బ్యాండులలో కీ బోర్డు వాయించే వాళ్ళు కూడా వుంటారు.

ఎన్నో కొత్త సంగీతాలకు , సమయానికి ఎదురు నిలబడి ఇప్పటికి ప్రాచుర్యం లో వుంది ఈ హెవీ మెటల్, ఎందరో రాక్ అభిమానులకు ప్రేరణ ఇస్తూ వుంది ఈ రాక్ సంగీతం.

ఎన్నో చీకటి భావనల మానిఫెస్టో ఈ రాక్ సంగీతం. గాయం, నొప్పి, పోరాటం వంటి నుంచి ప్రేరణ పొంది దాదాపు అన్ని రాక్ బ్యాండు లు తమ గేయాలు రాసుకుంటాయి. జీవితం లో కస్టాలు అనుభవించినవారు వున్నారు, పరిస్థితులతో పోరాటం చేసి గాయ పడిన వారు వున్నారు, ఇష్టమైన వారిని పోగొట్టుకున్న వారు వున్నారు, తిరస్కారణకు గురి అయిన వారు వున్నారు, వీరందరినీ భాదలోంచి బయటకు నెట్టి వెసదే ఈ రాక్ సంగీతం.

ఈ హెవీ మెటల్ సంగీతం ఎవరికి బయపడదు. ఈ భయ రహిత భావ ప్రకటనే ఈ రాక్ సంగీతాన్ని ఎవరు ఆక్రమించు కోలేనిది గా చేస్తుంది.

ఈ రాక్ సంగీతం లో అనేక రకాల ఉప రాక్ సంగీత ధోరణులు వున్నాయి, గ్రంజ్ రాక్ అని, గోతిక్ రాక్ అని, గరాజ్ రాక్ అని, సైకిడలిక్ అని ఇలా అనేక రకాలు వున్నాయి. ఈ రాక్ బ్యాండులలో బ్లాకు సబ్బాత్, లెద్ జేప్ప్లిన్, దీప్ పరప్లె, ది దోర్స్, స్కార్పిఅన్స్, లింకిన్ పార్క్, జిమి హెన్ద్రిక్ష్, పింక్ ఫ్లాయిడ్, మేటలికా, మెగా డెత్, స్పుతెర, వంటివి చాల పేరు మోసిన బ్యాండ్స్.



ఉదాహరణకు ఈ పాటను asaanthamu చూడండి.

1 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

"సంగీతం కు" సరి కాదు .. "సంగీతానికి" అని రాయాలి.