ఈ బ్లాగును శోధించు

లోడ్ అవుతోంది...

Monday, November 8

తరతరాల చరిత్ర



మనవడా ,,,,,
నీ వంశ చరిత్ర నీకు తెలియకపోతే నీకు ఈ ప్రపంచం లో ఏమి తెలియనట్లే. ఒక ఆకుకి దాని రెమ్మ, కొమ్మ, వేరు, చెట్టు,, ఇలా మూలాలు తెలిసివుండాలి. మన తాతలు భుధవరేన్యులు, విద్వజ్ఞులు, సకల కళా పారంగతులు, వీరులు, సేనానులు, రైతులు, నావికులు, స్పురద్రుపులైన సాంకేతిక విజ్ఞానవేత్తలు, విదుషి ప్రజా విభవ సంపన్నులైన నటులు, కళాకారులు, పండితులు, శిల్పాచార్యులు, పండిత ప్రాకండులు, విజ్ఞులు ఇలా ఎందరో మన వంశం లో జన్మించి మన వంశానికి సంపూర్ణత్వం సిద్ధింప జేశారు. ఈ స్రష్టల శుభాశీస్సులు పరిమళాలు నీలో కొత్త దీప్తిని,సరికొత్త స్పూర్తిని చిగురింప జేస్తాయని నా పరిపూర్ణ విశ్వాసం. వారి లాగే నీ జీవితం కూడా దేశప్రగతికి, సామాజిక పురోగమనానికి, సాంస్కృతిక వికాసానికి, సంఘచైతన్యానికి, మానావభ్యుదయానికి, నవ్వ్యతకి నాంది పలికే రీతులకి, నీతులకి అంకితం కావాలని నా కోరిక........


భయపడకు - పైన చెప్పిందంతా utter shit .....


మనవడా,,
నేను జీవన సంధ్యలో వున్న, కాటికి కాళ్ళు చాపుకున్నా, వూరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది. నా ABC la లో ఆపిల్స్ లేవు, బాల్స్ లేవు, ఇప్పుడు A = arthritis, B=బాడ్ బ్యాక్, C = chest pain , cardiac arrest వంటివి వున్నాయి. U = Urinary difficulties సమస్య ను డాక్టర్ దగ్గర చూయించుకుందామని పట్నంకి వచ్చినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ తో నీవు బైక్ మీదుగా వెళ్ళడం చూసా. Ofcourse , she is cute , but టాపిక్ here is not about her. మీ నాన్న కు ఏదో నీతో IPS , IAS, FRCS LONDON చేయించడం లాంటి పిచ్చి పిచ్చి కలలు వున్నాయని తెలిసింది. You can be what you choose to be. But you can never be an elephant. నువ్వు మీ నాన్న మాటలు వినకు, నీ తోచింది చెయ్యి. లైఫ్ ఎంజాయ్ చెయ్యి.

An apple a day keeps ది డాక్టర్ away - ఇది అందరి విషయం లో. కాని మన విషయం లో తేడా జరుగుతుంది. నేను ఈ రోజే ఒక ఆపిల్ తిందామని దాన్ని కోరికా, అది చాల గట్టిగా వుంది, దాంతో నా పండు ఊడిపోయింది, దాని వలన నేను dentist ని కలవాల్సి వచ్చింది. జీవితం అంటే కష్టాలతో అల్లబడినది. Anyone who says differently is selling something. మన వంశం వారికి అన్ని ఇలాగే జరుతాయి. మన వంశం శాపగ్రస్త వంశం. మన పూర్వికులను దోచుకున్నారు, మన భూములు లాక్కున్నారు, మన చరిత్రను కాలరాచారు. మనల్ని చరిత్ర హీనులని చేసారు. ఒక రకంగా చెప్పాలంటే మన వంశం మొత్తం దురదృష్టవంతులే. భారత దేశాన్ని ఏలిన ఎన్నో వంశాల సరసన మన వంశం కూడా చరిత్ర లో వుండి తీరాల్సిన వంశం - మౌర్యులు, గుప్తులు, కనిష్కులు, శాతవాహనులు, కాకతీయులు, ఇలా వీటి తో సమానంగా ఇంకా ఎక్కువే చరిత్ర వున్నా వంశం మనది. అఖండ భారత దేశానికి ఉన్నంత చరిత్ర మనకి వుంది. మన తాతలు ఎన్నో గోప్పపనులు చేసినా కూడా చరిత్ర కారులు ప్రాముఖ్యం ఇవ్వలేదు. చరిత్రకారులకి విశాల నేత్రాలు, ఓపెన్ మైండ్ లేవు.

అందుకే చరిత్ర లో మనం అడుగడుగునా వున్నా కూడా మనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఎలాగంటే, నీకు అర్థం అయ్యేలాగ చెబుతాను. నేను ఒక రోజు నిద్ర పట్టక అలా పెన్నా నది తీరాన సుమారుగా ఒక గంట నడిచి వచ్చాను. ప్రొద్దున్నే ఊర్లో పుకారు "హరి ప్రసాద్ రెడ్డి కి ఈత రాదు " అని. ఇలా మనం ఎన్నో గొప్ప పనులు చేసాక కూడా ఈ ప్రజలు మనల్ని గుర్తించలేదు. ఈ విషయాలు ఏవి మీ అవ్వతో చర్చకు తీసుక రాకు. మీ వంశం అంతా తింగర సచ్చినోల్లె అని ఆవిడ అభిప్రాయం. This is purely a man to man talk . ఆ దేవుడు చేసిన రెండో తప్పు మీ అవ్వను పుట్టించడం. మొదటి తప్పు ఏంటి అని నన్ను అడగకు. నాకే తెలియదు.

మన వంశ మూల పురుషుడు: తాత no #1
ఓ కాలం లో కౌశికునికి (విశ్వామిత్రునికి), వశీష్టునికి ego clash వచ్చింది. వశిష్టుని కామధేనువు నుంచి అనేక వేల మంది సైనికులు వచ్చి కౌశికుని సైన్యాన్ని ఓడించారు. యుద్ధం ముగిసిన పిమ్మట వశిష్టుడు సైన్యాన్ని మళ్ళి కామధేనువు లోకి వెళ్లిపొమ్మన్నాడు. సైనికులందరూ వెళ్ళిపోయారు. కాని ఒక్కడు మాత్రం "ఎందుకు వెళ్ళాలి"? అని ప్రశ్నించాడు. వశిష్టుడు యేవో యేవో లాజిక్కులు చెప్పి మన తాతను కన్విన్సు చేయాలని చూసాడు. మన తాత నాతో అవి అవదు, నేను వెళ్ళను అన్నాడు. ఇక చేసేదేమీ లేక వశిష్టుడు తన ఆశ్రమం లోనే వున్న ఒక సూపర్ ఫిగర్ ని ఇచ్చి పెళ్ల్లి చేసాడు. అలా సృస్తికర్తకే ఎదరు నిల్చిన వంశం మనది.

తాత NO #224
ఈయనకు ఆశ్రమ జీవితం బోర్ కొట్టింది. చిన్నప్పుడు వేదాలు చదవకుండా వెదురు బొంగులతో ఆడుకున్నాడు. పురాణాలు చదవమంటే ఇసుకలో పుల్లలతో ఆడుకున్నాడు. ఆశ్రమం లో కన్యల్ని eve teasing చేసేవాడు. Spoiled Brat అన్న మాట. వీనికి జ్ఞానం సున్నా అని తెలుసుకున్న వశిష్టుల వారు అలా నాలుగు ప్రదేశాలు తిరిగితే కొంచెం దేశ కాల మాన పరిస్థుతులు తెలుస్తాయని "నాయనా, మన ఆశ్రమం లో అన్ని రకాల పశు పక్షాదులు వున్నాయి కాని ఒక వుడుత కూడా లేదు, నువ్వు ఎలాగైనా ప్రపంచమంతా తిరిగి ఒక్క ఉడుతను తీసుకొని రా" అని చెప్పాడు. ఇక్కడే మీ అవ్వ మన వంశాన్ని ఉడుతలు పట్టిన వంశం అని హేళన చేస్తూ వుంటుంది. కాని చారిత్రాత్మక గొప్పతనాన్ని అర్థం చేసుకొనే అవగాహన మీ అవ్వకు ఆ భగవంతుడు ఇవ్వలేదు. అలా మూడు దిక్కులు వెతికి ఇక దక్షిణం దిశకు పయనమై వెళ్ళాడు. అక్కడ ఒక ఉడుత దోరికింది. దానికి astro-physics, geology (a study of time and pressure), construction excellence లాంటి subjects నేర్పించాడు. ఆ ఉడతను తీసుకొని ఉత్తర దిక్కు వైపు పయనం సాగిస్తుండగా బడలిక తో ఒక చెట్టు కింద చిన్న కునుకు తీసాడు. ఆ ఉడత అక్కడ bridge construction సైట్ వెళ్లి ఆ construction work ని పరిశీలించి వాళ్ళు చేస్తున్న తప్పును గమనించి తన దేహాన్నే టిప్పర్ గా చేసుకొని ఆ స్టోన్స్ మధ్యలో ఇసుకతో gaps fillup చేసింది. ఈ ఉడుత శ్రమను గమనించి ఆ site ప్రాజెక్ట్ మేనేజర్ రాముల వారు తన మూడు వేళ్ళతో దాని వీపు మీద శాశ్వతంగా మూడు horizontal lines ని tatto గా వేశాడు . అలా ఆ ఉడుత పురాణం లో చోటు చేసుకుంది. కాని మన తాత మాత్రం పురాణం లో లేకుండా పోయాడు. అస్సలు మనకి అతి పెద్ద ద్రోహంచేసింది ఆ వాల్మీకి. సంస్కృతం లో అర పద్యం కూడా మన తాత గూర్చి రాయలేదు. అయినా ఈ జనాలకు కూడా అస్సలు సముద్రతీరం లోకి ఉడుత ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎవరి ఉడత అనే rational thinking, logical analysis లేవు రా.


తాత NO #3281
ఈయన ఆంధ్ర దేశాన ఒక చిన్న రాజ్యానికి రాజు. విలు విద్య లో గొప్ప నేర్పు వున్నవాడు. కాని ఈయన భార్య పెద్ద గయ్యాళి. ఆమె ఈయన పాలిట పెద్ద శాపం. ఆమె socrates భార్య కు ఎక్కువ సూర్యకాంతం కు కొంచెం తక్కువ అనుకో. ఆయనేమి ఈమెను కోరి కోరి పెళ్లి చేసుకోలేదు. Actual గా మన తాత ద్రౌపది స్వయంవరానికి వెళ్ళాడు. సభలో కుడి వైపున ముందు వరుసలో మూడో స్థానం లో కూర్చున్నది మన తాతే. కర్ణునికి Second But one ప్లేస్ లో మత్స్య యంత్రం ట్రై చేసాడు. అప్పుడు ఆయనకు తెలియనది ఏమిటంటే ఆ స్వయంవరం అర్జునునికి కృష్ణుడు ప్రీ-ఫిక్స్ చేసాడు అని. ఆ స్వయం వరం తరువాత మన తాత బాగా de -motivate అయ్యి ఆయన morale దెబ్బ తిన్నది. తరువాత చాల స్వయంవరాలు ట్రై చేసాడు కాని వర్క్ అవుట్ అవలేదు. చివరకు మూడు కుందేళ్ళు అందరికేంటే ముందుగా పట్టుకొచ్చే స్వయంవరం లో టాలెంట్ మొత్తం కుమ్మరించి గయ్యాళి ని పెళ్లి చేసుకున్నాడు. చెత్త job కి ఇంటర్వ్యూ ఈజీ గా వుంటుంది. సుయోధనుడి 73 వ తమ్ముడు, మన తాత ఒకే గురువు దగ్గర పక్షుల ధ్వని అనుకరణ అనే విద్య నేర్చుకున్నారు. అప్పట్లో ఆ స్టడీస్ కి బాగా డిమాండ్ వుండేది. వేటలో బాగా ఉపయోగపడేది. ఆ మిత్రుత్వం తో మహా భారత యుద్ధం లో కౌరవుల తరపున మన తాత ఒకటి నర్ర రోజు యుద్ధం చేసాడు. 18 అక్షోహిని ల లో అర అక్షౌహిని మన తాతదే. కాకపోతే ఆ ఒకటి నర్ర రోజు యుద్ధం కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వలన కృష్ణుడే అర్జునికి pilot అని తెలియక చేసాడు. మీ అవ్వ మాత్రం యుద్ధం లో పారిపోయిన వంశం మనది అని హేళన చేస్తూవుంటుంది. మన తాత ఆ యుద్ధం result కూడా ప్రీ-ఫిక్స్ అని ముందే guess చేసాడు. He is a visionary and good at disaster management in his times. అంత గొప్ప పురుషున్ని ఆయన భార్య సదా అంతులేని నసతో హింసించేది. Since then he lived happily ever after .


తాత NO #13421
ఈయన గూర్చి పెద్ద గా చెప్పడానికి ఏమి లేదు. కాని భలే వెరైటి మనిషి లే. ఒక asteroid వచ్చి భూమి మీదపడ్డాకా అందరు డైనోసార్లు అన్ని చని పోయాయి అనుకున్నారు. కాని ఒక నాలుగు మాత్రం బ్రతికి బిక్కు బిక్కు మంటూ బ్రతికాయి. ఈయన వాటిని బంధించి తన రథానికి గుర్రాల బదులు వీటిని వాడాడు.

తాత no # 345678
రాయలసీమ అని ఇప్పుడు పిలుచుకునే భూమి అంతా గడ్డి మైదానాలతో కప్పబడి వుండేది. ఒక నది లేదు, నీరు అస్సలు వుండేది కాదు. రాళ్ళు లేవు, రప్పలు అయితే అస్సలు ఉండేవి కావు.నంది కొండలో నుంచి పెన్నా నది అటు పటమట వైపు పారి arabia సముద్రం లో కలిసేది. ఆ నదిని తూర్పు వైపు మళ్ళించి బంగాళ ఖాతం లో కలిపింది మన తాతే. రామేశ్వరం పోయి అక్కడ ఒక సేతువు కి ఆధారంగా వున్న రాళ్ళు అన్ని తెచ్చి రాయలసీమ లో పెట్టాడు. రాముడు కట్టించిన సేతువు - లంక కు పోయే వారికి అంటే ఆ రోజుల్లో పడవలు afford చేయలేని వారికి, పుష్పక విమానం లేని సామాన్యులందరికీ ఉపయోగపడే సేతువు యొక్క రాళ్ళు తెచ్చాడని మన తాత ను అపార్థం చేసుకోకు. ఆ రాళ్ళు మన పూర్వీకుల ఆస్థి (read తాత నో#224).



తాత NO #7979312

ఈయన నా ఫేవరేట్. ఆంగ్లేయులు తన గ్రామం మీదకు దాడి కి వచ్చినప్పుడు ఈయన పొలం లో పని చేసుకుంటూ వున్నాడు. ఎవరో చెబితే ఊర్లోకి వెళ్ళాడు. అప్పటికే ఊరు సగం నాశనం అయ్యింది. ఆంగ్ల సైనికులు హండు గ్రెనేడ్లు విసురుతూ భీబత్సం సృష్టిస్తున్నారు. ఈయనది బాగా షార్ప్ మైండ్. ఇంతలో ఒక హండు గ్రేనేడు తన మీదకు దూసుకరావడం గమనించాడు, split అఫ్ నానో సెకండ్ లో ఆ గ్రేనేడు విసిరిన అంగ్ల సైనికుని ఆహార్యం వేష బాషను పరిశిలించి వాడు పాంటుకి జిప్పు పెట్టుకోలేదని గమనించాడు. దాడికి వస్తు పాంటుకి జిప్పు కూడా పెట్టుకోలేని వాడు విసిరిన హండు గ్రేనేడు ఎలా ఉంటుందో అంచనా వేసాడు.తన మీదకి వచ్చిన హాండు గ్రేనేడు ని ఒడుపుగా గాల్లో యెగిరి పట్టుకొని చూసాడు. ఆ హండు గ్రేనేడు కి బటన్ కేప్ తీయకుండా ఉన్నింది. బటన్ కేప్ తెస్తేనే గ్రేనేడు పెలేది. మన తాత తనే బటన్ కాప్ తీసి తనే ఆ హండు గ్రేనేడుని ఆంగ్లేయుల పైకి విసిరి ముగ్గరి ప్రాణాలు తీసాడు.

తాత NO#7979317. ఇది నేనే.

మాన్ అఫ్ ది ఇయర్ by బొప్పేపల్లి టైమ్స్ (మన వూరు బొప్పేపల్లి గ్రామ పంచాయితి గ్రంధాలయ ముద్రిత పక్ష పత్రిక వారి వార్షిక అవార్డు). The బొప్పేపల్లి టైమ్స్'s Man Of The Year has ranked among the most prestigious and time-honored traditions in journalism. Though there are many who make and shape our village, only one can be chosen to be The బొప్పేపల్లి టైమ్స్'s Man Of The Year. A roster of past selections reads as a veritable who's-who of history's towering figures: ఆకుల దానయ్య - ఎరువుల వ్యాపారి, అత్తరు అమ్మే సత్తారు సాయుబు, లుంగీలు అమ్మే లంగడా సాయుబు, కరణం కామయ్య శెట్టి, ఇలా ఎందరో గొప్పవారి సరసన నేను నిలిచాను. ఎవరైతే ఒక అద్దం లాగ తమ గ్రామ ప్రజల కలలని, భాధలను ఆశలను, ప్రతిబింబిస్తారో వారికే ఈ అవార్డు దక్కుతుంది. నా ఇంటి నుంచి ఎదురింటి వరకు వున్న ప్రపంచాన్ని నేను అన్వేషించి తెలుసుకోగలిగాను. నేను ప్రకృతి ని ఎంతో ప్రేమించాను, పక్కింటి పశువుల కొట్టం నుంచి వచ్చే మధు మధుర సువాసనలు తెలుసుకోగలిగాను. నా గూర్చి చెప్పడం అంత బాగోదు, ఇక ఆపేస్తాను.



మనవడా,,,

చివరగా ఒక విషయం గుర్తుంచుకో. పైన చెప్పబడిన మన పూర్వికులంతా ఏదో పీకుదాం, పోడుద్దాం అని పోరాడిన వారే. కాని వారి నిష్కామ కర్మలకి దక్కిన ప్రతిఫలం విన్నావుగా. నీవు కూడా వారి అడుగు జాడల్లో నడిచి నీ జీవితాన్ని వృధా చేసుకోకు.

cross-cultural synergy, technology and culturo-ideological restructuring. Medicine, ఇంజనీరింగ్, postmodern consumer culture, religion, family, marriage, community, patriotism, staggering complexity, political stagnation, widespread socioeconomic alienation and a dull, aching sense of spiritual numbness. We live out blank and empty lives, empty of passion, bereft of hope - ఇప్పుడు సమాజం లో ఇన్ని సమస్యలు వున్నాయి. ప్రొద్దున్నే వేప పుల్ల నోట్లో పెట్టుకొని చెంబు చేతిలో పట్టుకొని relaxed గా కాలకృత్యాలు తీర్చుకొనే అంత టైం లేదు మీకు.

నీ గర్ల్ ఫ్రెండ్ తో నీవు బైక్ మీదుగా వెళ్ళడం చూసా. Ofcourse , she is cute , but టాపిక్ here is not about her.మీ నాన్న కు ఏదో నీతో IPS , IAS, FRCS LONDON చేయించడం లాంటి పిచ్చి పిచ్చి కలలు వున్నాయని తెలిసింది. You can be what you choose to be. But you can never be an elephant. నువ్వు మీ నాన్న మాటలు వినకు, నీ తోచింది చెయ్యి. లైఫ్ ఎంజాయ్ చెయ్యి.





9 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

nice post :)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

:D

కొత్త పాళీ చెప్పారు...

zindabad! :)

సుజ్జి చెప్పారు...

Super!!!

శ్రీకర్ చెప్పారు...

Excellent!

చెప్పాలంటే.... చెప్పారు...

chalaa chalaa baavundi

మధురవాణి చెప్పారు...

:) :)

హరే కృష్ణ చెప్పారు...

కెవ్వ్..!

Sujata చెప్పారు...

ఐబాబోఇ ! అదరగొట్టేశారే ! నవ్వలేక చచ్చ !