To,
రాష్ట్ర ssc బోర్డు ఆఫీసర్ కి,
హైదరాబాదు.
అయ్యా,
ఈ ఉత్తరం ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా, గత 10th క్లాస్ పరిక్షలలో నాకు వచ్చిన మార్కులు 357. ఫస్టు క్లాసుకి కేవలం మూడు మార్కులు తక్కువ. మీరు వెంటనే గత మార్కులు సవరించి మూడు మార్కులు అదనంగా వేసి 360 చేయమని మనవి. 360 కంటే ఎక్కువగా మార్కులు ఇవ్వదలచుకుంటే, అది మీ దయ. ఈ క్రింద తెలుపబడిన కారణముల వలన మిమ్మల్ని ఇలా అడగవలసి వచ్చింది:
1. పరీక్షలో నా పేపర్ చూసి కాపి కొట్టిన వాడికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి.
2. ఎవరి పేపర్ చూసి నేను కాపి కొట్టానో వానికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి.
3. మీరు నాకు వేసిన 357 మార్కుల వలన:
a. అనంతపురం లో సూపర్ ఫిగర్స్ జాయిన్ అయ్యే నేషనల్ సాయి బాబా కో-ఎడ్ జూనియర్ కాలేజి లో నాకు MPC ఇంగ్లీష్ మీడియం లో సీటు ఇవ్వరు.
b. చచ్చినట్టు ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజి లో జాయిన్ అవ్వాలి.
c. అలా జరిగితే, నా జీవితం లో అత్యంత విలువైన రెండు సంవత్సరాలు అతి దారుణంగా గడపాల్సి వస్తుంది.
d. నా మార్కులు చూసి మా నాన్న ఇప్పటికే ఆస్థి అంతా చెల్లి ( 5th క్లాసులో 4th ర్యాంకు వచ్చిన ) పేరు మీద రాసేస్తాడు.
e. పైగా పాకెట్ మని కూడా కట్ అయ్యి కడు పేదరికం లో కొట్టుమిట్టాడుతున్నా.
f. నన్ను ఎంతో మంది అమ్మాయిలు ఛి కొట్టారు. కాని, నేనంటే ఇష్టపడే ఆ చందన కూడా నేషనల్ సాయి బాబా కో-ఎడ్ జూనియర్ కాలేజి లో చేరింది. ఇప్పుడు నేను ఆ కాలేజి లో చేరకపోతే తను మిస్ అవుతుంది.
4. నేను స్కూల్ బంక్ కొట్టిన ప్రతి సారి మనోజ్ గాడి notes ఫాలో అయ్యే వాడిని. విచిత్రంగా వాడి notes లోవున్న ఒక్క ప్రశ్న కూడా ఈ exam లో రాలేదు.
5. ఇక as usual నేను చదువుకొన్న ఈజీ topics కూడా రాలేదు.
6. ఇక మీకు రెడ్డీస్ అంటే hate వుంటే నేను రెడ్డి కాదు. స్కూల్ లో జాయిన్ అయ్యేటప్పుడు పొరపాటుగా అల నా పేరు వ్రాశారు.
7. మీకు అనంతపురం అంటే hate వుంటే, మాది అస్సాం.
8. నేను పరిక్షల సమయం లో ఈ క్రింద తెలుపబడిన రోగముల తో అనారోగ్యంగా వున్నాను.
a. మలేరియా
b. చికున్ గున్యా
c. మెదడు వాపు వ్యాధి
d. టై ఫాయిడ్
e. బాత్రూం లో కింద పడి కుడి చేతి చూపుడు వేలు, బ్రొటన వేలు విరిగాయి.
9. ఇక మా స్కూల్ లో టీచర్స్ కి minimum స్టాండర్డ్స్ లేవు.
10. ఎక్షామ్ హాల్లో జరిగిన కొన్ని సంఘటనల వలన కూడా నేను పరిక్షలు సరిగ్గా వ్రాయలేదు.
a. హింది exam - నాకు జన్మ జన్మల శత్రువైన ఆ శరత్ గాడు ఎక్షామ్ మధ్యలో నా పేపర్ తీసుకొని పారిపోతే, వాణ్ని చేజ్ చేసి పట్టుకొని తిరిగి ఎక్షామ్ వ్రాసే సరికి టైం అయ్యిపోయింది.
b. maths ఎక్షామ్ - essay ప్రశ్నలన్నీ symbols తోను, problamatic ప్రశ్నలన్నీ essay తోను వ్రాశాను. నా సృజనాత్మకత మీకు నచ్చలేదనుకుంటా.
c. సైన్సు exam - multiple ఛాయస్ answers అన్ని BABE, BABY, BEBO , ఇలా రొమాంటిక్ గా వచ్చేలా వ్రాశా.
d. ఇంగ్లీష్ exam - additional షీట్ తో పేపర్ ఎరోప్లేను చేసి ఇన్విజిలేటర్ ముక్కులో ఎడం నాసికా రంధ్రం లో గురి చూసి వేశాను.
e. natural సైన్సు - ఈ సబ్జక్ట్ నా మత విశ్వాసాలకి వ్యతిరేకంగా వుండడం చేత అంత శ్రద్దగా వ్రాయలేదు.
f. సివిక్స్ - ముందు రోజు లేట్ నైట్ సామూహిక స్టడీస్ వలన లేట్ గా లేవడం జరిగి ఉన్నపళంగా నోట్లో బ్రష్ తో వంటి మీద towel తో exam కి వెళితే, అరగంట ఆలస్యమైన పర్లేదు ప్యాంటు shirt వేసుకొని రమ్మని నన్ను తిప్పి పంపారు. అలా నా అరగంట వేస్ట్ చేశారు.
******* చివరగా నాదో సలహా. 10th క్లాస్ exam కి కూడా ప్రతి exam సెంటర్ లో cheer girls కాని కనీసం చీర గర్ల్స్ వుంటే బాగుంటుంది.
ఇట్లు,
hari ప్రసాద్ (రెడ్డి కాదు)
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

3 వ్యాఖ్యలు:
chala baaga rasaru andi...
ముందు రోజు లేట్ నైట్ సామూహిక స్టడీస్ వలన లేట్ గా లేవడం జరిగి ఉన్నపళంగా నోట్లో బ్రష్ తో వంటి మీద towel తో exam కి వెళితే, అరగంట ఆలస్యమైన పర్లేదు ప్యాంటు shirt వేసుకొని రమ్మని నన్ను తిప్పి పంపారు. అలా నా అరగంట వేస్ట్ చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,sooper...bagundi
naadi kuda ide vinnapam andi,,okesari mee letter lo santakalu sekarinchi pampandi,,naalanti sorry mana lanti vallu chala mande untaaru kada,,annattu naku 484 vachayi so 500 miss ayindi..so daniki apply chesukunta ne kuda,,,
nice post,,,
hahaha, super ga undi.
manju naku kuda same marks 484 vachhayi 10th lo :) same pinch ;)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి