అందరిని క్షమించా,,,,,,,,
ఒకటో తరగతి : ఫ్రిడ్జ్ పైన కవర్ లో అమ్మ దాచిపెట్టిన మూడు రూపాయలు దొంగతనం చేసి గంగాధర్ గానికి ఇచ్చా. ఆరు ఎక్లైర్స్ చాక్లెట్లు తీసుకరమ్మని చెప్పా. 12 సొంటి పిప్పరమెంట్లు తెచ్చిన గంగాధర్ గాడిని క్షమించేశా.
రెండో తరగతి: స్కూల్ నుంచి ఇంటికి వస్తూ నడి రోడ్డు మీద zigzag shape లో పాస్ పోస్తూ వస్తుంటే చూసిన మా చిన్నాన్న చితక తన్నాడు. ఆ వయసులో రొటీన్ కి బిన్నంగా సృజనాత్మకతతో అలోచించి ఆచరణలో పెట్టిన నన్ను అభినందించక చావబాదిన మా చిన్నాన్న ని క్షమించేశా.
మూడో తరగతి: NT రామారావు ముఖ్యమంత్రి అయితే సినిమాలు ఫ్రీగా చూపిస్తారు అనుకున్నా. NT రామారావు ని కూడా క్షమించేశా.
చెట్లను నరికి తయారు చేసిన నోట్ బుక్కులలో homework చేయడం ఇష్టం లేక తన్నులు తిని.. ప్రతి టిచర్ ను క్షమించా.
నాలుగో తరగతి: ఎర్ర నిక్కరు, తెల్ల టి-షర్టు వేసుకుంటే సుధీర్ లాగ క్లాసులో ఫేమస్ అవొచ్చు అనుకున్నా. కాని నేను ఎర్ర నిక్కరు, తెల్ల
టి-షర్టు వేసుకొని కూడ ఫేమస్ అవలేదు. గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 4th క్లాసు 'c' సెక్షన్ ను మొత్తంగా క్షమించా.
ఐదో తరగతి: నా పలక దొంగలించి ఆ కిషోర్ గాడు సబీనా కు 'ఐ లవ్ u' అని వ్రాశాడు. ఇది తెలిసి కేరళ జెపమణి సార్ నన్ను చిన్న వయసు కామందు నివి అంటూ తన్నిన చోటు తన్నకుండా తన్నాడు. నిజం తెలియకుండా నన్ను కొట్టిన జెప మణి సార్ ని కూడా క్షమించా.
ఆరో తరగతి: హిందీ అక్షరమాల నేర్చుకోవడం కష్టమని QUARTERLY ఎగ్జామ్స్ కి ఒక కాపీ పేపర్ రాసుకొని వచ్చా. అది తీసి వ్రాసే ధైర్యం లేక కృష్ణ మోహన్ గాడికి ఇచ్చా, వాడు ఆ పేపర్ తీసి వ్రాసి వాని పేపర్ నాకు చూపించాలి అనే ఒప్పందం పైన. ఎందుకంటె కాపీ పేపర్ తో పట్టుబడే కంటే ముందు వాడి పేపర్ చూసి వ్రాయడం తక్కువ నేరం కాబట్టి. వాడు మాత్రం పేపర్ తీసి వ్రాసి నాకు చూయించకుండా exam హాల్ నుంచి వెళ్ళాడు. కృష్ణ మోహన్ గాడిని క్షమించా.
ఏడో తరగతి: ఇందిరా మేడం కార్ హ్యాండిల్ కి toothpaste పూసిన స్కాం లో పది మంది కుట్రదారులలో మొదటి పేరు నా పేరు చేర్చిన క్లాస్ లీడర్ ప్రీతీ ని క్షమించా.
ఎనిమిదో తరగతి: స్నేహ ధర్మం తో శీను గాడి ప్రొగ్రెస్స్ రిపోర్ట్ పైన అచ్చం వాళ్ళ నాన్న లాగ దొంగ సంతకం పెట్టా. ఇది జరిగిన పది రోజులకు పెంట పెంట అయ్యి నన్ను వారం రోజులు స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. నేను స్నేహానికి ఇచ్చిన విలువను, అంత చిన్న వయసులోనే నేను నేర్చుక్కున్న ఫోర్జరీ కళను ఒకే సారి ప్రదర్శిస్తే హర్షించలేని సమాజాన్ని క్షమించా.
తొమ్మిదో తరగతి: అఫ్రీన్ కు నా లవ్ లెటర్ ఇమ్మని ఇంతియాజ్ గానికి ఇచ్చా. వాడు అఫ్రీన్ కి ఇవ్వకుండా నా లవ్ ని reject చేసింది అని చెప్పాడు. మిత్ర ద్రోహిని క్షమించా.
పదో తరగతి: 10th క్లాస్ అయ్యాక ఏమి చదువుతావ్ అని నాన్న అడిగాడు. నగ్మాను పెళ్లి చేసుంటా నాన్న అన్నాను. ఆ రోజు మా నాన్న ఆడిన squash ఆట ఇప్పటికి నేను మర్చిపోలేదు. పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకొని నాన్నను క్షమించా.
ఇంటర్మిడియేట్ 1 వ సంవత్సరం: అప్పుడు నేను అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ABVP వైస్ ప్రసిడెంటు గా ఉన్న రోజులు. బాలుర SC వసతిగృహం లో సౌకర్యాలు సరిగా లేవని కలెక్టర్ ఆఫీసు ముందర ధర్నా చేయాలని, నన్ను ఒక వంద మంది ని పోగేసుక రావాలని మా సీనియర్ ABVP కాలేజి ప్రసిడెంటు విశ్వరూపాచారి అడిగాడు. తనకు తెలిసిన ఆంధ్రభూమి పత్రిక ఫోటోగ్రాఫర్ వస్తాడు. జస్ట్ ఫొటోకు ఫొస్ ఇస్తే చాలు అన్నాడు. కాని ఆ రోజు జరిగిన రచ్చ కు పోలీసులు చేసిన మర్యాద తో నన్ను నమ్మి వచ్చిన MPC ఇంగీష్ మీడియం A B C సెక్షన్ వాళ్ళ, MPC తెలుగు మీడియం B C సెక్షన్ వాళ్ళ వీపులు పగిలాయి. తరువాత మా MPC వాళ్ళు నాకు ఫిజిక్స్ లాబ్ లో చేసిన పూజ ను, విశ్వరూపచారి ని క్షమించా.
ఇంటర్మిడియేట్ 2వ సంవత్సరం: "SAVE OIL SAVE INDIA " అనే ఇండియన్ ఆయిల్ కంపెనీ బోర్డు చూసి శ్రావ్యా ను నడిపించుకుంటూ సినిమాకు సైకిల్ మీద తీసుక వెళ్లాను. శ్రావ్య నన్ను వొదిలేసింది. నీవు భలే మంచి పెయింటర్. నీ ఫేస్ నీ బాగా పైంట్ చేసావు అని రాధాతో అన్నా. తను నన్ను వొదిలేసింది. అందరిని క్షమించా.
తెలంగాణ వస్తే హైదరాబాద్ లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడితే STD పడుతుంది. హైదరాబాద్ కి వెళితే నాకు రోమింగ్ పడుతుంది అని కొత్త యాంగిల్ ని పరిచయం చేసిన హేమంత్ గాడిని క్షమించా.
లోక్ పాల్ బిల్లు వస్తే అవినీతే కాకుండా నా భార్య అరాచకం నుంచి నాకు రక్షణ ఉంటుందా అని అడిగిన మహేష్ గాడిని క్షమించా.
మా నాన్న ఫ్రెండ్ కి ఒక సిస్టం వుంది. అది స్లో గా వుంది అని కంప్లైంట్ చేసాడు. నేను టెక్ సపోర్ట్ చేస్తున్నా. ఆయనకు ఒక వేరుశనగ నూనె మిల్లు వుంది. గూగుల్ క్రోం డౌన్లోడ్ చేసి దీన్నుంచే BROWSE చేయి అని చెప్పా. ఎందుకంటె పాత INTERNET EXPLORER స్లో గా పనిచేస్తుంది అని చెప్పా. తన నూకాలమ్మ దేవత వాల్ పేపర్ పోతుందని చెప్పాడు. దానికి దీనికి సంబంధం లేదు అంటే వినడె. పైగా కొత్త లాప్ టాప్ కొన్నాక ఒక కోడిని బలి ఇస్తే ఆ సిస్టం బాగా పని చేస్తుందని చెప్పాడు. ఆయనను క్షమించా.
నేను ఐడియా కంపెని లో పనిచేసేటప్పుడు ఒక నలభై 45 యేండ్ల కస్టమర్ తనకు నంబర్ చివరలో 143 వుండే నంబర్ కావాలని అడిగాడు. తన గర్ల్ ఫ్రెండుకు గిఫ్ట్ ఇవ్వాలి అని. నాకు వచ్చిన చిరాకును లెక్క చేయక అతడిని క్షమించా.
RTC బస్సులలో ఎండ కాలం కిటికీలు తెరుచుకోవు, చలి కాలం మూసుకోవు. నేను కూర్చున్న సీటు కే PUSH బ్యాక్ పనిచేయదు. అలాగని గరుడ ఎక్కితే నేను కూర్చున్న సీటు పైనే AC లీక్ అవుతుంది. రెండు నెలలుగా వేసిన సినిమాలనే వేసి (మైఖేల్ మదన కామ రాజు, మాయలోడు, ప్రేమికుడు) RTC బస్సు ను క్షమించా.
ఇంగ్లీష్ లో ఒక సామెత వుంది. " 'If your father is poor, its your fate..if you father in law is poor, you are stupid". ఆ ఇంగ్లిష్ వాడు నన్ను స్టుపిడ్ అన్నందుకు వాడిని క్షమించా.
నా చిన్నప్పటి ఫ్రెండ్స్ లో చాల మంది దొంగ నాయాళ్ళు ఇప్పుడు లాయర్లు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, కాబోయే రాజకీయ నాయకులు అయ్యారు. ఈ సమాజానికి రాబోయే రోజులు తలచుకుంటే ఎలాగో వుంది. నా భవిష్యత్తు ని క్షమించా.
One of the great regrets in my life is that I suffered so many assholes so gladly for so many years, all for the sake of a paycheck. నా ex -bossess ని క్షమించా.
"పాకిస్తాన్ - ఇండియా చర్చలు " ఇదే మన ఇండియా లో అతి పెద్ద జోక్. ఈ విషయం అర్థం కాని మన జనాన్ని క్షమించా.
ఈ మధ్య తెలుగు సినిమాలలో ఇంగ్లీష్ వాడకం, అమెరిక నేపథ్యం ఎక్కువ అయ్యింది. అంతగా ఆ రెండు కావాలనుకొంటే అవి ఇంకా ఎక్కువ మోతాదులో వున్న ఇంగ్లిష్ సినిమాలనే కంప్యూటర్ వున్న మనం torrent లో డౌన్లోడ్ చేసుకొని చూస్తాం కదా. లేదా utv action తెలుగు చూస్తాం కదా. ఇలా చెత్త సినిమాలు తీసే తెలుగు సినిమా పరిశ్రమని క్షమించా.
తీవ్రవాదులకి కూడా 'ముంబై spirit' వుందని తెలియని మన చిదంబరాన్ని క్షమించా.
ఫాంట్ విప్పినప్పుడు కింద పడిన కాయిన్ జాడ వికీ లీక్స్ లో కూడా కనపడక పోయే సరికి వికి లీక్స్ ని కూడా క్షమించా.
ఎవరు ఎప్పుడు ఎక్కడ బాంబు పెట్టారో తెలిసిన దిగ్విజయ్ సింగ్ intelligence ని ఉపయోగించలేని భారత ప్రభుత్వాన్ని క్షమించా.
మా ఇంట్లో లక్ష్మి నరసింహ స్వామి పటం వెనుకాల నాలుగు పాత రూపాయలు దొరికాయి. అవి మీడియా trp ratings కి పనికిరావని తెలిసి మీడియా ను క్షమించా.
రేపు జరగబోయే అన్నా హజారే దీక్ష నుంచి ఎంతో సులువుగా ఈ దేశ ప్రజల దృష్టి ని మరల్చడానికి ఇంకా IPL 5 ప్లాన్ చేయని భారత ప్రభుత్వ అజ్ఞానాన్ని క్షమించా.
దేవుణ్ణి చల్లగా చూడమని హుండీ లో రూపాయి బిళ్ళ వేసి పూజారి హారతి పళ్ళెం లో పది రూపాయలు వేసి మరి వేడుకున్నా. నాకు పెళ్లి చేశాడు!!!. దేవుణ్ణి క్షమించా.
NOW I FEEL LIKE GOD . I AM GOD !! నా పేరు దేవుడు. హరి ప్రసాద్ రెడ్డి.

10 వ్యాఖ్యలు:
హహహ....భలేగా ఉన్నది!
పెళ్ళి చేసుకుని అందరినీ మరచిపోయినందుకు మిమ్మల్ని కూడా బ్లాగర్లందరూ క్షమించేశారు.
:))
సూపరు !!! కొంపదీసి ఈ టపా పెళ్లి side effect కాదు కదా? ;-)
జీవితం లో అడుగడుగునా ప్రతి ఒక్కరినీ క్షమించిన మీరు దేవుడు బాబూ దేవుడు.. డౌటే లేదు!
చాలా బాగుంది!
:D congrats!!
నేను మీ సైట్ గూగుల్ రీడర్ లో కలిపి చూస్తున్నాను, మేకు కమేన్తతనికి లింక్ ఓపెన్ చేసి మరి వచ్చా.
మీ టపా చాల చాల బావుంది. మీ సృజనాత్మకత చాల బావుంది.
ఇంకా పుస్తకాలలో రాయని మీ పెళ్లి అనుభవాలు, పెళ్లి తరువాత కస్టాలు కుడా రాయండి.
మేము కూడా కొన్ని రాళ్ళు వేస్తాము :-)
నిజమే మీరు దేవుడే ఒప్పుకున్నాం
క్షమా ఒక్కటే కాదు దైవ లక్షణం
బంగళూరు పక్కనో, చెన్నై వెనకనో మీకు అయిదువందల ఎకరాలు స్థలం ఉండాలి, అందులో నాలుగెకరాల విశాల ఏసీ భవంతి, ఆడీ, బెంజ్, బెంట్లే కార్లు బోలెడు డబ్బు దస్కం( అంటే నాకు తెలీదు)ఉండాలి.
మొత్తం మీద మీకు రా సొమ్మే కానీ పో సొమ్ము ఉండకూడదు అప్పుడే మీరు గాడ్. తత్వమసి !!
NICE HUMOUR !! WRITE MORE.
really excellent andi. nenu office lo navvuapukoleka gattiga navvithe ma office vallu pichichupulu chasaru , jaaliga. hats off andi. BTW this is my 1st cooment in life.
పదో తరగతి: 10th క్లాస్ అయ్యాక ఏమి చదువుతావ్ అని నాన్న అడిగాడు. నగ్మాను పెళ్లి చేసుంటా నాన్న అన్నాను. ఆ రోజు మా నాన్న ఆడిన squash ఆట ఇప్పటికి నేను మర్చిపోలేదు. పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకొని నాన్నను క్షమించా. ...........
IDI AWESOME KEKA RACHCHA....
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి