ఈ బ్లాగును శోధించు

లోడ్ అవుతోంది...

Sunday, September 18

నా మిత్రుడు మరియు గురువు నా APS RTC బస్సు

దుర్యోధనుడు - కర్ణుడు.
ద్రోణాచార్యుడు - అర్జునుడు.
నిత్యానంద - రంజితా.
నేను - నా RTC  బస్సు.

ఇన్ని సంవత్సరాల నా జీవితం లో నేను కనుక్కున్నదేమిటంటే RTC బస్సు మన జీవితాన్ని,  ప్రపంచాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తుంది.

RTC  బస్సు  నాకు "అదృష్టం - దురదృష్టం" అనే విషయాన్ని పరిచయం చేసింది.
------ ఒక సారి బెంగుళూరు నుంచి హైదరాబాదుకు ముందస్తుగా గరుడ 10 :15  pm  బుక్ చేసుకున్నా. కాని పని భారం వలన కొంచెం, ట్రాఫిక్ వలన కొంచెం ఆలస్యం అయ్యింది. నమ్ముతారో లేదో, ఆ రోజు మేము ఎక్కిన ఆటో డ్రైవర్ కి పదమూడు కాల్స్ వచ్చాయి. ఐదు నిముషాలు ఆలస్యం అయ్యింది. బస్ జంప్. మన కి ఆలస్యం  అయినప్పుడు బస్ ఒక్క ఐదు నిముషాలు కూడా వెయిట్ చెయ్యదు. అదే మనం టైం కి వచ్చినప్పుడు ఒక్కని కోసం ఒక్క గంట కూడా వెయిట్ చేస్తారు.

RTC  బస్సు నాకు "ఫిలాసఫి" నేర్పింది.
------ ఆ రోజు 12 :30  am  స్పెషల్ బస్ అది కూడా express బస్ దొరికింది. నేను కండక్టర్ ని అడిగాను" సార్, ఇప్పుడు మిడ్ నైట్ అయ్యింది కదా, హైదరాబాదు కి ఎప్పుడు చేరుకుంటుంది" ?,, అప్పుడు కండక్టర్,, "చూడు బాబు బస్ హైదరాబాద్ పోయినప్పుడు పోయింది అని అనుకోవాలే గాని ఎప్పుడు పోతుంది అని అడగకూడదు." The  Journey , not  The  arrival  matters  - T S  Elliot .

RTC  బస్సు నాకు ఆరోగ్యం నేర్పింది.
---- LESS  LUGGAGE , MORE COMFORT -- ఇది మన సామానుల కే కాదు, మన శరీర బరువు గూర్చి కూడా అని తెలుసుకున్నా.

RTC  బస్సు నాకు "బాడీ language" నేర్పింది.
---చేతులు బయట పెట్టరాదు --- తెలియకనో గాని అత్యుత్సాహము తో గాని మన చేతల ద్వారా అవతలి వారికి రాంగు సిగ్నల్ ఇవ్వకూడదని.
RTC  బస్సు నాకు "extreme  sports " నేర్పింది.
----- ఫుట్ బోర్డు ప్రయాణం - ఎప్పుడైనా Sea  surfing  కి పనికి వస్తుంది. ఊపిరి సలవని రష్ వున్న బస్ లో ప్రయాణం - ఇది నేను హిమాలయన్ expedetion  చేసినప్పుడు, అక్కడ హై altitudes  లో ప్రాణవాయువు ఉండదు. అప్పుడు పనికి వస్తుంది. రన్నింగ్ బస్ నుంచి దిగడం - పారా గ్లైడింగ్ చేసినప్పుడు పనికి వస్తుంది.  ఇక తాడిపత్రి - తిమ్మంపల్లి బస్ 'లో' కాదు లాస్ట్ బస్ 'పైన' ప్రయాణం -  ఆహా ఎక్కడా కోచింగ్ ఇవ్వని extreme  స్పోర్ట్స్. పైన కూర్చున్నప్పుడు అలెర్ట్ గా వుండాలి. చెట్టు వచ్చినప్పుడు వంగాలి. వైర్లను తప్పించుకోవాలి. Only  smart  asses  will  survive  and  enjoy  the  ride .


RTC  బస్సు నాకు "reality" అలవాటు చేసుకోవడం నేర్పింది.
---అల్కెమిస్ట్ లో "నీవు హృదయం లో ఏమి కోరుకున్నా, అది తీర్చడాని కి ఈ విశ్వం అంతా నీకు సహాయం చేస్తుంది" అని వుంది. కొన్ని వందల బస్ ప్రయాణాలు చేశా.  అన్నవరం సత్యనారాయణ స్వామీ మీద వొట్టు, ఒక్క మామూలు అమ్మాయి కూడా నా ప్రక్కన సీటులో కూర్చోలేదు.


RTC  బస్సు  నాకు "అదృష్టం - దురదృష్టం" అనే విషయాన్ని పరిచయం చేసింది.
ఒక సారి ప్రొద్దుటూరు - కడప హైటెక్ బస్ లో నేను ఒక్కడినే ప్రయాణీకుడిని. I felt  Like  King. Only  RTC బస్ can  treat  you  like  shit  all  the  time  and  like  king  once  in  a  life  time .


RTC  బస్సు  నాకు "రూరల్ development" చూయించింది.
ఒక సారి నేను 'పల్లె వెలుగు' లాస్ట్ బస్ లో మా వూరికి వెళుతున్నాను. బస్ కదిలింది. లైట్లు ఆరిపోయాయి. నా బస్సు అయ్యింది మల్టీ-pub  కాంప్లెక్స్.  ప్రతి రెండో వ్యక్తి దగ్గర వున్నాయి - హై flashy  phones.  బస్ నిండా ఇరవై ఫోన్లు, ఏ పాట సరిగ్గా వినబడటం లేదు. What  a  gadgets  they  have !!!!.
 
RTC  బస్సు  నాకు "అసాధ్యం - సుసాధ్యం" నేర్పింది.
--- ఫైవ్ స్టార్ హోటల్లోనే ఫైవ్ స్టార్ రెట్లు ఉంటాయని తెలుసు. కాని ఫైవ్ స్టార్ హోటల్లో కాకుండా ఫైవ్ స్టార్ రెట్లు వున్న ఐటమ్స్ తినాలంటే..  బస్ డ్రైవర్ భోజనానికి ఆపిన హోటల్ లో తింటే తెలుస్తుంది.

RTC  బస్సు  "RTC థర్డ్ లా ఆఫ్ మోషన్" .
---- నీవు రన్నింగ్ బస్ ఎక్కేటప్పుడు ఆ బస్ స్పీడ్ కంటే, నీవు ఎక్కి కూర్చున్న తరువాత ఆ బస్  స్పీడ్ మూడింతలు తక్కువగా వుంటుంది.


RTC  బస్సు   "RTC సెకండ్ లా ఆఫ్ మోషన్" .
---- నీవు హై టెక్ బస్ ఎక్కినప్పుడు నీ బస్ కంటే పల్లె వెలుగు బస్ స్పీడ్ గా వెళుతుంది. అదే నీవు పల్లె వెలుగు బస్ ఎక్కినప్పుడు హై టెక్  బస్ స్పీడ్ గా వెళుతుంది.


RTC  బస్సు   "RTC మొదటి లా ఆఫ్ మోషన్" .
---- అవసరమున్నప్పుడు సరైన సమయానికి రాదు. అవసరం లేనప్పుడు సమయానికే వస్తుంది.


RTC  బస్సు  నాకు "Management  Lesson" నేర్పింది.
------ఒక రోజు బస్ రాగానే క్యు లో నిలబడకుండా, కిటికీ లోంచి రుమాలు వేసి సీటు బుక్ చేసుకున్నా.  బస్ బయలుదేరిన  అరగంటకు సీటు దొరకక నిలబడిన ఒక ఆసామి "నాకు వాంతికి వస్తుంది , ఒక సారి లేచి కిటికీ ప్రక్కన వున్న మీ సీటు ఇస్తారా? " అని అడిగాడు. ఇవ్వక తప్పింది కాదు. కథ లో నీతి ఏమనగా - " by  doing  shortcuts  you  may  reach  to  the top  quickly , but  it  won 't  keep  you there."


 RTC  బస్సు  నాకు "దురదృష్టం నీ నీడ" అని చెప్పింది.
బస్ లో ఒకే ఒక్క గుట్కా తినే వాడు, ఒకే ఒక్క తాగుబోతు, ఒకే ఒక్క అరాచకమైన గురక పెట్టె వాడు, మిట్టమధ్యాహ్నం కూడా ప్రక్క వాడి  భుజం మీద నిద్ర పోయే వాడు -వెతికి వెతికి మరి నీ పక్క సీటులో నే వచ్చి కూర్చుంటాడు. బస్ లో వున్న ఒకే ఒక చిన్న పాప నీ దగ్గర సీటులోనే వుండి ఆపకుండా ఏడుస్తూ వుంటుంది.

 RTC  బస్సు  నాకు "ECONOMICS" గూర్చి నేర్పింది.
---పండుగలప్పుడు RTC వారు వడ్డించే రేట్లు "డిమాండ్ - supply  - pricing " chapters ని  గుర్తుకు తెస్తాయి. 

 RTC  బస్సు  నాకు "లైఫ్-happiness" గూర్చి నేర్పింది.
---కాట్ కార్డ్ 10 % డిస్కౌంట్ -- అంటే జీవితం లో 10 % మాత్రమే happiness  వుంటుంది అని తెలుసుకొన్నా.

RTC  బస్సు  నాకు "help" గూర్చి నేర్పింది.
-----ఎవరైనా రన్నింగ్ బస్ ని పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ వుంటే బస్ లోని అందరు అతనికి సహాయం చేస్తారు.

RTC  బస్సు  నాకు "ప్రాప్తం" గూర్చి నేర్పింది.
---- టికట్ కి సరిపడనంత డబ్బులు ఇవ్వడమే మన పని. చిల్లర వస్తుందా రాదా అనేది మన 'ప్రాప్తం' పైన ఆధారపడి వుంటుంది. ఒక వేళ జ్ఞాపక శక్తి బాగా వుండి మర్చిపోకుండా చిల్లర అడిగితే ఆ కండక్టర్ ఫేసు ఎలా ఉంటుందంటే "చిన్న పిల్లాడి చేతిలో ఐసు క్రీము లాక్కుంటే ఆ చిన్న పిల్లాడు పెట్టె ఫేసు " లాగ వుంటుంది.
ఒక సారి బస్ లో వున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. APSRTC ని KingFisher  take-over  చేస్తే ఎలా వుంటుందో అని.  touch  screen  lcd   screens,bus -hostess . .....



భీమిలి నుంచి విశాఖ కు  వచ్చే లాస్ట్ బస్ లో ప్రయాణం చాల బాగుంటుంది. రాత్రి - చల్ల గాలి --- బస్ లో తక్కువ జనం - అవరేజి స్పీడు. ప్రక్కన చీకటి లో సముద్రం, అలల ఘోష...


అయినా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి RTC తో అనుభంధం వుంటుంది. నాదయితే వీరాభిమానం.  RTC నా మతం.  
RTC ప్రయాణికుడినని గర్వించు. RTC ప్రయాణికుడిగా జీవించు.

9 వ్యాఖ్యలు:

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ చెప్పారు...

చిన్నప్పుడు ఈనాడులో ఒక కధ చదివాను..
హైదరాబాదీలందరికీ ఒలింపిక్స్ లో అన్ని పతకాలు వచ్చేస్తాయి (బంగారు, వెండి, కంచు సహా ). సంగతేమిటంటే, వారంతా బస్సు భాధితులు.
మీ పోష్ట్ చదువుతుంటే అది గుర్తొచ్చింది.

KumarN చెప్పారు...

Very Funny :-))
చాలా 'lessons' అదిరాయి :-))

వనజ వనమాలి చెప్పారు...

ఇన్ని అనుభవాల పాఠాలు చదివాక .ఈ అనుభవాన్ని ఆస్వాదించాక కాదంటామా ? ఆర్.టి .సి యే . .. మా గురువు దైవం కూడా.

Vamshi చెప్పారు...

వా ..వా వా.. మమ్మీ.....మళ్ళీ అలా తిరిగే అదృష్టం ఎప్పుడో.. ఐ మిస్ మై హైదరాబాద్...

Sujata చెప్పారు...

100/100 - Loved your post.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగుందండీ!

రాజ్ కుమార్ చెప్పారు...

sooooper andi..
anni points ki 100 marks..

ee point ki 200 marks.. BINGO

RTC బస్సు నాకు "reality" అలవాటు చేసుకోవడం నేర్పింది.
---అల్కెమిస్ట్ లో "నీవు హృదయం లో ఏమి కోరుకున్నా, అది తీర్చడాని కి ఈ విశ్వం అంతా నీకు సహాయం చేస్తుంది" అని వుంది. కొన్ని వందల బస్ ప్రయాణాలు చేశా. అన్నవరం సత్యనారాయణ స్వామీ మీద వొట్టు, ఒక్క మామూలు అమ్మాయి కూడా నా ప్రక్కన సీటులో కూర్చోలేదు..>>>>>

kallurisailabala చెప్పారు...

super post Andi.chala bavundi

lakshminaresh చెప్పారు...

anni nijaale..naa full support meeeke...manam kukatpally vellante 127k buses 10 vasthaayi....kondapur vellali ante 225D lu 10 vasthaayi...