ఈ బ్లాగును శోధించు

ఆదివారం, మార్చి 18

కొబ్బరి చిప్ప .... శాపంకొబ్బరి చిప్ప .... శాపం 

టైం ఎంత అయ్యింది? ఓహో ఏడు గంటలు..ఇప్పుడు నేను ఏదో తాగాలే? హా ,,, కాఫీ.   కాఫీ తాగాలి.  ఒక్క నిముషం,,,నాకు పెళ్లైంది కదా,,, ఒసేయ్ పెళ్ళాం!! కాఫీ తీసుకరా. లోపల్నుంచి "ఆడవాళ్ళు కాఫీ చేయకూడదు. నువ్వే చేసుకో."  ఏంటి? ఏ బుక్కు లో అలా వ్రాశారు?.  తను ఒక పుస్తకం తెచ్చి  నా ఒళ్లో పడేసింది. అ పుస్తకమంతా వెతికా. ఎక్కడా మగవాళ్ళే కాఫీ చేయాలని వ్రాయలేదు. అదే విషయం చెప్పా. ఆ పుస్తకం Bible . ఇదిగో ఇక్కడ అని "Hebrew" అనే పదం చూపించింది. నేను  what the fuc**** లాజిక్ ????. అప్పుడు తను He-Brew అంటే కాఫీ  ని మగవాళ్ళే తయారు చేయాలి అని విడమర్చి చెప్పింది. అయినా మనం క్రిస్టియన్స్ కాదు. మనం అది పాటించ కూడదు. తను "నేను క్రిస్టియన్ స్కూల్ లో చదివా, Hebrew, ఆ ఒక్క విషయం లో మాత్రం నేను నిష్టగా ఉంటా".  Hebrew అనేది జివిష్ బాష. ప్రాపంచిక సామాజిక అధ్యాత్మిక మత బహు బాష వైజ్ఞానిక ప్రదర్శనలోద్దు. నేను కూడా క్రిస్టియన్ స్కూల్ కి వెళ్ళా, "లవ్ తై నైబర్" అని వుంది, అది నేను కూడా నిష్టగా పాటిస్తాను అని చెప్పాలనుకున్నా, కాని చెప్పలేదు. 

తను, నేను కొన్నేళ్ళు చాలా సంతోషంగా వుండేవాళ్ళం. తరువాతః మాకు పెళ్లి అయ్యింది. No woman will treat you as badly as the woman you marry.  ఈ రోజే నా Encyclopedia Britannica ను quickr లో అమ్మకానికి పెట్టాలి. నా భార్యకు అన్ని విషయాలు తెలుసు. New systems generate new problems.  - marriage is the best example.

గేటు వరకు వెళ్ళా. ఈ రోజు ఆంధ్రభూమి పేపర్ రాలేదు. పేపర్ షాపు లో అయినా కొందామని వెళ్ళా. అక్కడ i met two blood sucking selfish vampires. ఆ రెండు చాలా స్వార్థపరులు. వాటి స్వార్థమే తప్ప జన హితం తెలిదు. at all cost their hunger need to be fed. వాటి ఆకలి తీరితే చాలు. కాని వాటి రక్త దాహం తీరదు. నేను వాటిని మొదట్నుంచి చివరి వరకు తిప్పి చూశా. నా చేతులతో వాటిని ముట్టుకొన్నా. వాటిని రోజు నేను చూస్తున్నా, అవి చెప్పే విషయాలు వింటున్నా, అవి నన్ను సైతం ప్రభావితం చేస్తున్నాయ్,, ఓహ్ చెప్పడం మర్చిపోయా, అవి ఈనాడు మరియు సాక్షి పత్రికలు.

విషయం లోకి వస్తే,,, నేనో శాపగ్రస్తున్ని. చిన్నప్పుడు కొబ్బరిచిప్ప ఇవ్వలేదని ఐదో తరగతి  అయిన తరువాత వచ్చిన ఎండాకాలం లో నా క్లాస్మేట్ గాయత్రి ఇచ్చిన శాపం. అంత చిన్న వయసులోనే పెద్ద శాపం పెట్టింది. "రేయ్ హరి గా నువ్వు ఏమి తిన్నా అది అరగదు, నువ్వు ఏమి చేసినా నీకు అచ్చి రాదు".  నేను  "గాయత్రి నాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా శాపం పెట్టు".  For example, "భవిష్యత్ లో నువ్వు రాబోయే ఏదో తరగతి మాత్స్ exam  లో నీ calculator బ్యాటరి చెడిపోతుంది, బైయాలజి exam లో నీకు strict టీచర్ ని వేస్తారు".  నీ తొక్క లో శాపం నన్ను ఏమి చేయదు, కాపి కొట్టే వానికి calculator అవసరం లేదు, అని నేను చేబుతూండగా   వాళ్ళమ్మ పిలుపుతో గాయిత్రి వెళ్ళిపోయింది.  తరువాత నేను ఎప్పుడు ఆ విషయం పెద్దగా  పట్టించుకోలేదు. 


తరువాత నా జీవితం లో అన్ని దురదృష్ట సంఘటనలే.,,,,,
 • నేను లైన్ వేసిన ప్రతి అమ్మాయి తనకు Boyfriend వున్నాడని చెప్పేది.
 • కాలేజిలో నేను బంక్ కొట్టిన రోజే అటెండెన్స్ వేసే వారు. ఫైన్లు కట్టలేక చచ్చా.
 • 2003 లో యాభై వేలు పోసి నేను కొన్న "state of art computer ", కొన్న వారానికే  38 వేలకు sale పెట్టారు.
 • "కుచ్ కుచ్ హోతా హాయ్" అనే సినిమా నైట్ షో చూసి రూం కి వస్తుంటే ఒక రాలిపోయే తార ను చూసి కళ్ళు మూసుకొని కాజోల్ లాంటి భార్య రావాలని కోరుకున్నా. కళ్ళు తెరిచి చూస్తే అది రాలి పోయే తార కాదు, విమానం.
 • ఇంటర్ సెకండ్ ఇయర్  - అనంతపురం లో వున్న బూర్జువా అగ్రకుల పెట్టుబడిదారి భూసామ్య అందమైన అమ్మాయిలంతా ఏ నెల్లూరు లోనో విజయవాడ లోనో ఇంటర్ చదివే వాళ్ళు. అనంతపురం అంతా బోసిపోయి బోర్ కొట్టేది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఇన్ని రోజులు ఎక్కడ ఉండేదో తెలియదు కాని ఒక సూపర్ ఫిగర్ మాత్స్ పరిక్ష రోజు నా పక్కనే పడింది. అ అమ్మాయినే చూస్తూ రాసిన పరిక్ష ఫట్టు.
 •      
 • నేను రాసిన ఒక ఇరవై పేజీల కోడ్ చూసి  నా మేనేజర్, ఒక BUG కనిపెట్టాడు. అప్పుడు నేను అది "thats not a bug , its a feature " అని అన్నా. వుద్యోగం ఫట్టు.
 • బస్ లో  ఎప్పుడు గట్టిగా ఏడ్చే పాప పక్క సీట్లో. సూపర్ ఫిగర్ దూరం సీట్లో.
 • నేను ఎక్కాల్సిన బస్, నేను తొందరగా వెళితే ఆలస్యంగా  వస్తుంది. నేను ఆలస్యంగా వెళితే ఇంకా ఆలస్యంగా వస్తుంది.
 • తక్కువ మంది వున్నారు కదా అని చిన్న లైన్ లో నేను జాయిన్ అయితే, ATM లో కార్డ్ మెషిన్ లో ఇరికిచ్చే వాడు నా ముందరే ఉంటాడు. రిజర్వేషన్ కౌంటర్ లో పది ఫార్మ్స్ పట్టుకుని కంగారు మనిషి నా లైన్లో నా ముందరే ఉంటాడు. అదే బ్యాంకు లో అయితే కట్టలు కట్టలు డబ్బులు జమ చేసే వాడు నా లైన్లో నా ముందరే ఉంటాడు. అదే సినిమా థియేటర్ లో  అయితే గంట సేపు క్యు లో నిలబడి టికెట్ కోసం కొంటర్ లో చేయి పెడితే, houseful  అంటారు.
 • నేను ఎప్పుడు డ్రైవ్ చేసినా ఎండ నా ముఖం మీదనే పడుతూ వుంటుంది.
 • జాబు లో నేనెప్పుడు మంచి పెర్ఫార్మన్స్ చేసినా ఆ నెల వేరే ఇష్యూ వుంటుంది. అదే నా కొలీగ్స్ ఒక రకంగా పని చేసినా  "employee అఫ్ ది month", "employee అఫ్ ది quarter" వాళ్ళని వరిస్తాయి
 • నేను ఎక్కాల్సిన ఫ్లైటు ఎప్పుడు టెర్మినల్#1 లో వుండదు.    
ఇలా నా కష్టాల కడలి గూర్చి చెప్పుకుంటూ పోతే 10GB ప్లైన్ డేటా వుంటుంది. 

Some folks are born
silver spoon in hand,

Some folks inherit
star spangled eyes,

It ain't me,
it ain't me.
I ain't no senator's son.
I ain't no fortunate one.
I ain't no millionaire's son.

I ain’t got no money, no house on that hill
i ain't that fortunate, to inherit wealthy will.

అమ్మ ఎప్పుడు చెబుతూ వుండేది. చెడ్డ రోజులు ఎక్కువ రోజులు ఉండవని. కాని ఇన్ని చెడ్డ రోజులు ఉంటాయని చెప్పలేదు. నేనప్పుడు ఫ్రెండ్స్ ని ప్రేమించాను కాని వారి సిస్టర్స్ ని కాదు. నా సిస్టర్స్ ని ప్రేమించాను కాని వారి ఫ్రెండ్స్ ని కాదు. ఇలాంటి నాకు ఆ దేవుడు అన్యాయం చేసాడు. If there is a God he’s one cruel సాడిస్ట్.  సాడిస్ట్ అని అనుకోగానే సత్తిగాని నుంచి ఫోన్ వచ్చింది. మామ, సత్తి గా నేను ఈ రోజు సాయంత్రం నీతో కలసి మాట్లాడాలి. అర్జెంటు స్పీడ్, ఇంపార్టెంటు, అన్నా.

సాయంత్రం,,,
సత్తిగాడు: చాల సిల్లి రా. కొబ్బరి చిప్ప శాపాలకు జీవితాలు నాశనం అవుతాయా?
నేను: నీకు తెలుసు కదరా. గాయిత్రిది పవరఫుల్ కులం. వాళ్ళు ఏమి చెబితే అది జరుగుతుంది. మామ, ఈ షిట్ నేను ఇక ఏమాత్రం భరించలేను. ప్రొద్దున్నే కాఫీ కి కూడా దిక్కు లేదు.
సత్తిగాడు: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. 
నేను:   నా జీవితాన్ని మార్చుకోలేకే కదరా, ఐడియా కంపని లో ఉద్యోగాన్నే మానేశా.
సత్తిగాడు: నా పక్క క్యుబికల్ లో వచ్చిన కొత్త ట్రైని ని వశపర్చుకోవడం కోసం ebay లో కొన్న "హజ్రత్ హలీం సల్మాన్ షారుఖ్ అమీర్ ఏ అర్ రెహ్మాన్ బాబా" దర్గా  తాయోత్తు. ఇది కట్టుకొని రాత్రి పడుకో. తెల్లారి నాలుగు గంటలకు లేసి రెండు గంటల వరకు ధ్యానం చేయి. అంతా శుభం జరుగుతుంది.
నేను: తెల్లారి నాలుగు గంటలకు లేయడం అంత ముఖ్యమా?
సత్తిగాడు: early bird catches the worm.
నేను: what about early worm... ఓకే ......బట్ .the second mouse gets the cheese .
సత్తిగాడు: నిరాశ పడకు ... చీకటి దాటిన తరువాత టన్నెల్ చివరలో వెలుగు వుంటుంది.
నేను: అది ట్రైన్ లైట్ అయితే ,,,
సత్తిగాడు: trust me ...you feel good. its new morning,, new day,, ఒక్క రోజు ఆశావాద దృక్పథం తో ఆలోచించు, నా కోసం మామ.


మరుసటి రోజు ,,
తాయోత్తు కట్టుకొని పడుకొని  షార్ప్ ఐదు గంటలకే లేచి, రెండు గంటలు ధ్యానం చేశా. అప్పుడు సమయం ఆరు గంటలు.. సారి ఏడు గంటలు,, ఒక్కప్పుడు లెక్కల పరిక్ష తప్పి... ఇలా...అయిపోయా,,

ఈ రోజు నవోదయం. తొలి కిరణాలు భూమిని తాకాయి. అవి etv వారి ఉషాకిరణాలు అంత డల్ గా లేవు.   సూర్యుడు వెలుగు తో పాటు స్పష్టతను తెచ్చాడు. షేవింగ్ అద్దం తీసుకొని నా ముఖం నేనే చూసుకున్నా. నేను, దేవన హరి ప్రసాద్ రెడ్డి,  ప్రమాణం చేస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు ఈదుతాను.  ఎన్ని నష్టాలైన భరిస్తాను. no matter what distractions I must ignore,  ఈ రోజు రాత్రి పదకొండు గంటల వరకు నిద్రపోను. ఆ లక్ష్మి నరసింహ స్వామే ప్రత్యక్ష సాక్షిగా ఎంత హెవి లంచ్ తిన్నా కూడా ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోను. నా పట్టుదల నా దీక్ష నా నిబద్దత నా కట్టుబాటు నా నిష్ఠ  ఇవన్నీ తోడుగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు నిద్రపోకుండ వుండడానికి ప్రయత్నిస్తా. ఇక ఏ విషయము వాయిదా వేయను. ఈ రోజు సూర్యుడు ఈ భూమి మీద అస్తమించు గాక, నేను ఈ రోజంతా కష్టపడి పని చేస్తా. ఇలా కష్టపడి పని చేయడం ఏ మాత్రం సులభం కాదు.  కాని ప్రయతిస్తే తప్పు లేదు. 


ఎక్కువగా ఆలోచించడం వలన  Einstein బుర్ర ఎమ్మన్నా పాడు అయిందా.  కాలి నడకన దేశమంతా తిరిగిన గాంధీ కాళ్ళు అరిగి పోయాయా. అబ్దుల్ కలాం చెప్పినట్లు నా కలలను నిజం చేసుకుంటా. ఎప్పటినుంచో అనుకుంటున్న  నవల  ఇప్పుడే మొదలు పెడతాను. ఒక మ్యూజిక్ స్టోర్ ఓపెన్ చేయాలి. సత్య హరిశ్చంద్ర కాటి సీన్లో పద్యం అన్నట్లు,, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి,,కాని.. అని  ఇప్పటికే రెండున్నర్ర  డజను ఏండ్లు గతించుకొని పోయినవి. ఇదే చివరి అవకాశం నా కలలని పండించుకోవడానికి.  నా ఆశయం పైన నా ఏకాగ్రత వుంది.  నాకు ఆకాశమే హద్దు. ఇప్పటివరకు నేనేమి సాదించలేదు అనే ఈ కారణం  ఇక ఏమాత్రం నన్ను ఆపలేదు. నా సోమరితనాన్ని ఇక ఏ మాత్రం సహించను. ఇక ఏ విషయాన్ని వాయిదా వేయను. నాలో మొహమాటాన్ని ప్రారదోలుతాను and get that badass flaming-skull forearm tattoo . ఇక కాబోయే పార్టీ మాన్స్టర్ నేనే. టుడే, achieved the confidence, self-esteem, and sex appeal .  Mark my words: Nothing will get in the way of me getting things in the way of my goal.

సమయం ఉదయం ఎనిమిది గంటలు. ....
ఒసేయ్ పెళ్ళామా,,, కాఫీ తీసుకరా.... లోపల్నుంచి "రైలు పట్టాలు చూసి క్రిందటి రైలు ఏ వైపు వెళ్ళింది చెప్పలేము." నేను  "what the fuc**** లాజిక్ ????".  తను "ఇంజినీరింగ్ కాలేజి లో చదివి ఇంజీనీర్ అయిపోవచ్చు, ప్రసిడేన్సి కాలేజి లో చదివి ప్రసిడెంటు కాలేవు. టి కప్పు లో టి వుంటుంది కాని వరల్డ్ కప్ లో వరల్డ్ వుండదు". ఈరోజు ఈమె తమిళ స్టార్ విజయకాంత్ భాష మాట్లాడుతు వుంది. నిన్న జివిష్ బాష Hebrew మాట్లాడింది. ఒకే అర్థం అయ్యింది - he -brew. నేనే కాఫీ చేసుకోవాలి.. its same shit... different day.

నేను: రేయ్ సత్తి గా ... నీ తొక్కలో తాయోత్తు పని చేయలేదు. ఈ రోజు కూడా నో కాఫీ.
సత్తిగాడు: ఒకే ఒకే.... ప్లాన్ B . ఇప్పుడు గాయిత్రి ని పట్టుకొని  ఆ శాపం తీయించాలి అంటావ్.
నేను: కరెక్ట్ మామ.
సత్తిగాడు: ఇప్పుడు ఆమె కు పెళ్లి అయ్యి ఫిన్లాండ్ లో వుందని విన్నా.   ఫెసుబుక్కో, లింకేడిన్  ఎలాగోలాగు గాయిత్రి ని పట్టుకొని నీకు ఫోన్ చేయిస్తా. ఒక వంద కొబ్బరి చిప్పలు export చేద్దాం. శాపం తీయమందాం. 
నేను: వంద కాదు, వేయి అయినా నేను సిద్ధం. ముందు ఆ పని చూడు మామ.

7 వ్యాఖ్యలు:

puranapandaphani చెప్పారు...

అంతా బాగానే ఉంది కానీ... కొబ్బరి చిప్పల బాకీ తీర్చేయాలనుకోడం ఏమాత్రం బాగోలేదు.

జీడిపప్పు చెప్పారు...

తోటరాముడి పోస్టు చదువుతున్నామా అనిపించింది అక్కడక్కడా

"నేను కూడా క్రిస్టియన్ స్కూల్ కి వెళ్ళా, "లవ్ తై నైబర్" అని వుంది, అది నేను కూడా నిష్టగా పాటిస్తాను"

LOLLL ఇలా అనుకొని చాలామంది పక్కింటోళ్ళను తెగ ప్రేమించేస్తుంటారు :)

అజ్ఞాత చెప్పారు...

too good..

Viswambhara Murthy చెప్పారు...

Awesome dude.. keep going..

అజ్ఞాత చెప్పారు...

waiting for another post.............

the tree చెప్పారు...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

అజ్ఞాత చెప్పారు...

Hello. And Bye.